పోలవరానికి రూ.47,725 కోట్లు.. జలశక్తిశాఖ అంగీకారం

ysr-congress-party-mps-ministry-jal-shakti-vijayasai-reddy-polavaram

పోలవరం ప్రాజెక్టుకు రెండోసారి సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లకు ఆమోదం తెలిపేందుకు కేంద్ర జలశక్తిశాఖ అంగీకారం తెలిపింది.  ఈ ప్రతిపాదనలను నేడో రేపో  కేంద్ర ఆర్థికశాఖకు పంపి ఆ తరువాత కేంద్ర మంత్రిమండలికి పంపి ఆమోదింపజేయనున్నట్టు జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు హామీ ఇచ్చారు.  పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించి పెట్టుబడి క్లియరెన్స్‌ ఇవ్వాలని కోరుతూ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు బుధవారం కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో గంటపాటు సమావేశమయ్యారు.