భారతీయ ఐటీ కంపెనీలకు ట్రంప్‌ షాక్

0
155
trump h1b visa

హెచ్‌–1బి, హెచ్‌–4 వీసాల విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం తీసుకోనున్న కఠిన నిర్ణయాలు అమెరికాలోని పలు భారతీయ ఐటీ కంపెనీలపైన, లక్షల మంది భారతీయులపైన తీవ్ర ప్రభావం చూపనున్నాయి.అమెరికా ప్రభుత్వంహెచ్‌–4 వీసాదారులకు ఇస్తున్న వర్క్‌ పర్మిట్లను రద్దు చేయడం ఖాయమని తేలిపోయింది. అలాగే, హెచ్‌1బి వీసా నిర్వచనాన్ని , నిబంధనలను కూడా వచ్చే జనవరిలో సవరించనున్నట్టు అమెరికా హోంల్యాండ్‌ అండ్‌ సెక్యూరిటీ(డిహెచ్‌ఎస్‌) విభాగం ఇటీవల విడుదల చేసిన యూనిఫైడ్‌ ఫాల్‌ అజెండాలో పేర్కొంది.

దాని ప్రకారం   హెచ్‌1బీ వీసాకు సంబంధించిన ఉద్యోగం అంటే ఏమిటి, ఉద్యోగి–యాజమని మధ్య సంబంధం, ప్రత్యేక ఉద్యోగాలు అన్న అంశలకు సంబంధించిన నిర్వచనాలను సవరించనుంది.అంతేకాకుండా హెచ్‌1బీ వీసాదారులకు తగిన వేతనాలు లభించే అవకాశం కూడా లభిస్తుంది.ఈ సవరణల వల్ల అమెరికా కార్మికుల ప్రయోజనాలు రక్షించబడతాయని ప్రభుత్వం చెబుతోంటే, అమెరికాలోని పలు భారతీయ ఐటీ కంపెనీలు, భారతీయుల ఆధ్వర్యంలో నడుస్తున్న చిన్న, మధ్యతరహా కంపెనీలు ఈ సవరణలతో ఇబ్బందులు పడతాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్యం చేస్తున్నారు.

హెచ్‌1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు సంతానానికి హెచ్‌4వీసాలు మంజూరు చేస్తారు.ఈ వీసా పొందిన వారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ గతంలో ఒబామా ప్రభుత్వం నిబంధన తెచ్చింది. ప్రస్తుతం ఈ నిబంధనతో 70వేల మందికి పైగా భారతీయ మహిళలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు.ట్రంప్‌ ప్రభుత్వం ఈ నిబంధనలను ఎత్తివేయనున్నట్టు ప్రతిపాదించింది.అయితే, ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీని మూడు సార్లు వాయిదా వేసింది. తాజాగా విడుదల చేసిన ఫాల్‌ అజెండాలో కూడా ఈ నిబంధన ఎత్తివేతకు రంగం సిద్ధం చేస్తున్నట్టు స్పష్టం చేసింది.