శతకాల మోత మోగించిన బ్యాట్స్‌మెన్స్

అంబటి రాయుడు మెరుపు సెంచరీ

0
189
rohit sharma and ambati rayudu

కోహ్లి సేన దుమ్మురేపింది. నాలుగో వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (137 బంతుల్లో 162; 20 ఫోర్లు, 4 సిక్స్‌లు), మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు (81 బంతుల్లో 100; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకాల మోతతో టీమిండియా తిరుగులేని విజయాన్ని అందు కుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా. సర్‌ ఖలీల్‌ అహ్మద్‌, స్పిన్నర్‌ కుల్‌దీప్‌ విజృంభించడంతో 378 పరుగుల ఛేదనలో వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ చెల్లాచెదురైంది. స్కోరు బోర్డుపై 20 పరుగులు చేరాయో లేదో మూడు వికెట్లు కోల్పోయింది కరీబియన్‌ జట్టు. హేమ్‌రాజ్‌ (14)ను భువనేశ్వర్‌ ఔట్‌ చేయగా.. కీరన్‌ పావెల్‌ (4), హోప్‌ (0).. భారత ఫీల్డర్ల చురుకైన ఫీల్డింగ్‌తో రనౌట్‌గా వెనుదిరిగారు. ఈ స్థితిలో శామూల్స్‌ (18), హెట్‌మెయర్‌ (13) నిలిచినా.. అది కాసేపే! అద్భుతమైన బంతులతో విజృంభించిన ఖలీల్‌ అహ్మద్‌.. శామ్యూల్స్‌, హెట్‌మెయర్‌లను పెవిలియన్‌ చేర్చాడు. రొవాన్‌ పావెల్‌ (1)కు వేసిన బంతి అయితే కళ్లుచెదిరిపోయింది. మిడిల్‌ వికెట్‌ లైన్‌లో పడిన బంతి స్వింగ్‌ అవుతూ ఆఫ్‌స్టంప్‌ను ఎగరగొట్టింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్‌ హోల్డర్‌ (54 నాటౌట్‌) ఒక ఎండ్‌లో పోరాడాడు. ఒక దశలో 77/7తో నిలిచిన విండీస్‌ ఆ మాత్రం స్కోరు చేయగలిగిందంటే అది హోల్డర్‌ వల్లే. ఖలీల్‌తో పాటు కుల్‌దీప్‌ టెయిలెండర్ల వికెట్లు కూల్చి భారత్‌కు విజయాన్ని అందించాడు.