భారత్ లో మరోసారి నాలుగు లక్షలు దాటిన కరోనా కేసులు

India’s Covid-19 cases skyrocket to highest ever one-day tally of 4,14,188; 3,915 more die in past 24 hours

భారత్ లో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,14,188 మంది కోవిడ్ -19 సంక్రమణకు గురయ్యారు. కరోనా మొదలైనప్పటినుంచి ఒకరోజులో నమోదైన కేసులలో ఇదే అత్యధికం.. తాజా కేసులతో దేశంలోని మొత్తం కేస్‌లోడ్‌ను 2,14,91,598 కు చేరింది, ప్రస్తుతం భారతదేశంలో 36,45,164 క్రియాశీల కేసులు ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా 3,915 పెరిగి మొత్తం మరణాలు 2,34,083 కు చేరుకున్నాయి.

3,31,507 మంది రోగులు ఆస్పత్రులు మరియు కోవిడ్ కేర్ సెంటర్ల నుండి డిశ్చార్జ్ అయ్యారు, మొత్తం రికవరీలు 1,76,12,351 కు చేరాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. భారతదేశం అంతటా ఇప్పటివరకు మొత్తం 16,49,73,058 మందికి టీకాలు వేశారు. క్రియాశీల కేసులు మొత్తం అంటువ్యాధులలో 16.96 శాతంగా ఉన్నాయి, జాతీయ కోవిడ్ రికవరీ రేటు 81.95 శాతానికి పడిపోయింది. కోవిడ్ మరణాల రేటు 1.09 శాతంగా నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి.