పెరిగిపోతున్న ఇండోనేషియా మృత్యుల సంఖ్య

0
125
indonesia death toll

ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో సునామీ, భూకంపం సంభవించి పది రోజులు గడిచినప్పటికీ మృతుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు పలూ పట్టణంలో సుమారు 2వేల మృతదేహాలను వెలికితీశామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. తొలుత 5వేలకు పైగా గల్లంతు అయ్యారని భావించిన్పటికీ.. ప్రస్తుతమున్న పరిస్థితి చూస్తుంటే అంచనాకు అందటం లేదన్నారు. హోటల్‌ మొత్తం జల్లెడపట్టామని, ఇక్కడ 27 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీంతో మరణించిన వారి సంఖ్య 1,944కు చేరుకుంది. ఈ నెల 11 వరకు అధికారికంగా గాలింపుచర్యలు చేపడతామని స్థానిక మిలటరీ ప్రతినిధి తోహిర్‌ తెలిపారు.