ఏపీ ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు ఇచ్చే 25% వెయిటేజీ తొలగింపు

inter-weightage-removed-ap-eapcet

రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)లో ఇంటర్మీడియెట్‌ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం ప్రకటనలో వెల్లడించింది.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్‌లో ఇంటర్‌ గ్రూపు సబ్జెక్టుల మార్కులకు 25% వెయిటేజీ ఇస్తోంది.. ఎంసెట్‌ మార్కులకు 75%, ఇంటర్‌ మార్కులకు 25% వెయిటేజీతో మార్కులను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చేవారు. అయితే తాజా నిర్ణయంతో 25 శాతం వెయిటేజీ ఇకనుంచి ఉండదని తెలిపింది.