ఐపిఎల్ ఫేజ్ -2 షెడ్యూల్.. యూఏఈలో మ్యాచ్ లు

ipl-2021-to-resume-in-united-arab-emirates

బోర్డ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) స్పెషల్ సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం) ఈ రోజు ముంబైలో జరిగింది, బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో .. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021 ఫేజ్ -2 షెడ్యూల్, ఈ ఏడాది టి 20 ప్రపంచ కప్ వంటి విషయాలపై చర్చించారు. ముఖ్యంగా ఐపిఎల్ 2021 ఫేజ్ -2 షెడ్యూల్ ను యూఏఈలో జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం) అధికారికంగా నిర్ణయించింది.

సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో మిగిలిన 31 ఐపిఎల్ ఆటలు జరపాలని..  భారతదేశంలో ఉన్న 
కరోనా వాతావరణం దృష్ట్యా యుఎఇలో నిర్వహించాలని బిసిసిఐ  నిర్ణయించింది. మరోవైపు భారతదేశంలో టి-20 ప్రపంచ కప్‌ను నిర్వహించడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి ఎక్కువ సమయం కావాలని బిసిసిఐ నిర్ణయించింది. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి జూన్ 1న ఐసిసి తన సమావేశాన్ని నిర్ణయించింది, భారతదేశంలోనే ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని అవకాశాలను అన్వేషించాలని బిసిసిఐ భావిస్తోంది.