IPL 2021 సీజన్‌ రద్దు

ipl-2021-suspended-amid-increasing-cases-corona-positive-players-teams

దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 ఆందోళనల కారణంగా ఐపిఎల్ 2021 సీజన్‌ ను సస్పెండ్ చేస్తున్నట్లు బిసిసిఐ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు అత్యవసర సమావేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ (ఐపిఎల్ జిసి), బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) అత్యవసర సమావేశంలో ఐపిఎల్ 2021 సీజన్‌ను తక్షణమే వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు బిసిసిఐ అధికారిక ప్రకటనలో తెలిపింది. 

ఆటగాళ్లందరి భద్రత, ఆరోగ్యం మరియు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆటగాళ్ళు వారి ఇళ్లకు తిరిగి  వెళతారు. కాగా వేర్వేరు జట్లలో ఇప్పటికే 9 మంది ఆటగాళ్లకు కోవిడ్‌-19 సోకింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ క్రికెటర్లు, ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తొలుత టోర్నీని రద్దు చేయాలనీ బీసీసీఐ భావించింది.