డీ అంటే డీ అంటున్న చెన్నై,హైదరాబాద్

0
211
chennai vs hyderabad

ఇండియన్ ప్రీమియర్ లీగ్-11( IPL-11 ) లో ఇప్పటి దాకా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన లీగ్ దశ మ్యా చ్లు ముగిశాయి.నేడు క్వాలిఫైయర్-1 హైద్రాబాద్ సన్ రైజర్స్,చెన్నై సుపర్ కింగ్స్ మధ్య జరగనుంది.దీనిలో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్ కి చేరుతుంది.రెండు జట్లు,తమ అద్భుతమైన ప్రదర్శన తో పాయింట్స్ పతిక లో లీగ్ ఆరంభం నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.సమవుజ్జివులుగా ఉన్న ఇరు జట్లు ఈ సీజన్ లో ఇప్పటిదాకా రెండు సార్లు ముఖా ముఖి తలపడగా రెండు సార్లు చెన్నై గెలిచింది.కసి మీద ఉన్న సన్ రైజర్స్ ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటుండగా,బెట్టింగ్ ఇష్యూ కారణం గా రెండు సీజన్స్ తర్వాత వచ్చిన చెన్నై ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్స్ లో తామే ముందు అడుగుపెట్టాలి అని అనుకుంటోంది.దాదాపు ఆరు మంది హిట్టర్ల తో బ్యాట్టింగ్ లో పటిష్టం గా ఉన్న చెన్నై ఒక పక్క,తమ అద్బుతమైన బౌలింగ్ లైనప్ తో ఎంతటి చిన్న స్కోర్ నైనా ఛేదించకుండా చూసుంటూ వస్తున్న హైద్రాబాద్ ఒక పక్క.ఎవరు గెలుస్తారో అన్నది ఆ రెండు జట్లకో వారి అభిమానులే కాక,క్రీడా అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు.ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ముంబయి వాంఖడే స్టేడియం లో మ్యాచ్ జరగనుంది.

[penci_related_posts taxonomies=”undefined” title=”Related Posts” background=”” border=”” thumbright=”no” number=”4″ style=”list” align=”none” displayby=”cat” orderby=”random”]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here