ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ సోదాల కలకలం..!!

0
62
It Raids At Visakhapatnam

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసిన ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటికే తనిఖీలు ప్రారంభం కాగా విజయవాడ, గుంటూరు, నెల్లూరులోనూ సోదాలు చేసేందుకు ఐటీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. విశాఖలోని ఎంవీపీ కాలనీలో చార్టెడ్ అకౌంటెంట్ మురళీకృష్ణ ఇంట్లో ఐటీ బృందాలు సోదాలు జరుపుతున్నారు. మురళీకృష్ణ పలు కంపెనీలకు చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన సీఫుడ్స్ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోనూ ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గృహనిర్మాణ సంస్థ డైరెక్టర్ ఎన్.ఈశ్వరరావు ఇళ్లలో ఐటీ బృందం తనిఖీలు చేస్తోంది. రణస్థలం మండలం నదికుడితిపాలెంలోని ఈశ్వరరావు ఇంట్లో ప్రస్తుతం ఐటీ సోదాలు జరుగుతున్నాయి.