జాను మూవీ రివ్యూ

జాను మూవీ రివ్యూ

 

జాను మూవీ రివ్యూ
నిర్మాణం  - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.
నిర్మాత - దిల్ రాజు.
దర్శకుడు - C ప్రేమ్ కుమార్.
సంగీతం - గోవింద్ వసంత.
కెమెరా - మహేంద్రన్ జయరాజ్.

తారాగణం - 
శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్, రఘు బాబు, శరణ్య

కథ ఒక్క ముక్కలో - 
స్కూల్ రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని 17 సంవత్సరాల తర్వాత కలిస్తే   కలిగే ఎమోషన్ ఎలా ఉంటుంది.

" వెళ్లిపోయావా రామ్? దూరంగా వెళ్లిపోయావా" అని జానూ అడిగితే, " నిన్ను ఎక్కడ వదిలిపెట్టానో అక్కడే ఉండిపోయాను జానూ" అంటాడు రామ్,
అక్కడనుండి మొదలవుతుంది అసలైన కథ, ఈ సీను ఫస్ట్ హాఫ్ లో ఉండదు.. సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ హాఫ్ ఏదో అలా నడిచింది సినిమా, గతంలో చిన్నారి స్నేహితులు అనే  ముత్యాల సుబ్బయ్య గారి సినిమా వచ్చింది, స్కూల్ మేట్స్ రీ యూనియన్ అవ్వడం, వాళ్ళ ఎమోషన్స్ పంచుకోవడం. జానూ కూడా ఆ పోలికలతోనే ఉంటుంది. చేరన్ "నా ఆటోగ్రాఫ్, తంగర్ బచ్చన్ " అళగి (తెలుగులో sv కృష్ణ రెడ్డి లేత మనుషులుగా రీమేక్ చేశారు) లాంటి సినిమాల్లో చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి పెళ్లి అయ్యాక కనిపిస్తే కలిగే ఎమోషన్స్ ఆ సినిమాల్లో చూసి ఉన్నాం. 
కానీ 96 అనే తమిళ సినిమా ఓ అద్భుతమైన క్లాసిక్. దర్శకత్వ పరంగా, సంగీత పరంగా వెల కట్టలేని సినిమా. అందుకే ఇంతవరకూ రీమేక్ సినిమా చెయ్యని దిల్ రాజు ఈ సినిమా రిలీజ్ కి ముందే రైట్స్ తీసుకున్నారు. గతంలో బెంగుళూర్ డేస్ లాంటి సినిమాలు రీమేక్ చేద్దామని విరమించుకున్నా..
కానీ ఈ సినిమా మాత్రం రీమేక్ చేసారు. అంత కాన్ఫిడెన్స్ ఈ సినిమాపై. 


కానీ సమస్య ఎక్కడంటే 96 కాలానికి 2004 కాలానికి ఎనిమిది ఏళ్ళు తేడా ఉంది. ఈ ఎనిమిదేళ్లలో మనుషుల్లో, కాలంలో ఎన్నో మార్పులు జరిగాయి, ఎన్నో ఎమోషన్స్ మారాయి. 96 కాలంలో పిల్లలకి ప్రేమంటే లవ్ లెటర్స్, లిటిల్ హార్ట్స్  ప్యాకేట్స్, ఆటోగ్రాఫ్స్ ఇవే ఉండేవి. 2004 కాలానికి నెట్ సెంటర్స్, చాటింగ్స్, ఫోన్లో sms లు చాలా అందుబాటులోకి వచ్చేసాయి. 96లో పిల్లలు స్కూల్లో ఇళయరాజా గారి పాటలు పాడి ఉండొచ్చు, tv లో చిత్రలహరి చూసి ఉండొచ్చు. 2004లో స్కూల్ పిల్లలకి మెలోడీ పరంగా, వెస్ట్రన్ పరంగా ar రెహమాన్ మ్యానియా నడిచిన సమయం. టీవీల్లో  మా మ్యూజిక్, డాన్స్ బేబి డాన్స్ లు వచ్చేసాయి. 90ల్లో స్కూల్ పిల్లలు విడిపోయాక ఎవరెక్కడ సెటిల్ అయ్యారో తెలుసుకోవడానికి చాలా టైం పట్టేది, కలిసాక చాలా ఎమోషన్ ఉండేది. ఇప్పుడు ఫేస్ బుక్‌, వాట్సప్ వచ్చాక గ్రూప్స్ లో రోజూ మాట్లాడుకుంటున్నాం. ఎన్నో ఏళ్ళు మిస్సయిన ఫీలింగ్ ఉండదు. జానులో వాట్సప్ గ్రూప్ చూపించారు కానీ హీరో కోసం కన్విన్స్ చేసేసారు. నిజంగా 96 అనే సినిమా గొప్ప సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజుల్లో మనం సోషల్ మీడియాలో, టీవీ మీడియాలో ఎన్నో నెగిటివ్ వార్తలు చూస్తుంటాం. అక్రమ సంబంధాలు, ప్రియుడితో కలిసి భర్తని చంపిన భార్యలు, ప్రేమించిన అమ్మాయి కోసం భార్యని చంపేవాళ్ళు, ఇలాంటి సమాజాన్ని ఇప్పుడు చూస్తున్నాం. కానీ జానులో రామచంద్ర, జానకి పాత్రల్లో పవిత్రమైన ప్రేమని,  స్వచ్ఛమైన మనసుల్ని , అవకాశం ఉన్నా గీత దాటని గొప్ప వ్యక్తిత్వాన్ని చూస్తాం. కాకపోతే కొన్ని క్లాసిక్స్ ని టచ్ చేయడం అంటే.. తాజ్ మహల్ ని మళ్లీ కట్టమన్నా.. షాజహాన్ కూడా అంత అద్భుతంగా కట్టలేడు. జాను రీమేక్ విషయంలోనూ అంతే జరిగింది.

మాతృక లో జానకి, రామచంద్రల మధ్య ఒక రాత్రంతా కథ నడుస్తుంది. అద్భుతమైన భావోద్వేగాలతో, అనుభూతులతో, జ్ఞాపకాలతో తమిళ్ లో అద్భుతం గా అనిపిస్తుంది. తెలుగులో అచ్ఛం అలాగే చేసినప్పటికీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో గాను, సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషన్స్ సీన్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ స్లోగా ఉండడం వల్ల కొంచెం తేడా కొట్టింది. హీరో శర్వానంద్ కి గత రెండు సినిమాలు.. రణరంగం, పడి పడి లేచే మనసు సినిమాలు నిరుత్సాహపరిచిన తర్వాత, దొరికిన మంచి పాత్ర ఇది. 
కానీ విజయ్ సేతుపతి లాంటి గొప్ప నటుడు ఆ పాత్ర చెయ్యడం వల్ల ఆ సినిమా చూసిన ప్రేక్షకులకు శ‌ర్వా నటన తక్కువే అనిపిస్తుంది.  కానీ శర్వానంద్ మెప్పించాడు. ఇక సమంత.. తెలుగు వెర్షన్ కి ఆయువుపట్టు.  మజిలీ, ఓ బేబి సినిమాల్లో సమంత ఏ రేంజ్ లో ఫెర్ఫార్మన్స్ చేసిందో మనకి తెలుసు. జానులో కూడా మొదట మాములుగా అనిపించినా తర్వాత తర్వాత జానకి పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. కాకపోతే 96 తో అవార్డు గెలుచుకున్న త్రిషతో పోల్చలేం. 
నిజంగా ఇది సున్నితమైన దృశ్యకావ్యం. స్లో నెరేషన్ వల్ల కొంచెం సాగినట్టు అనిపిస్తుంది. కమర్షియల్  సినిమా కోరుకునే వారికి నచ్చకపోవచ్చు. చిన్నప్పటి శర్వానంద్ పాత్ర కుర్రాడు పరవాలేదు.. చిన్నప్పటి సమంత పాత్ర చేసిన అమ్మాయి అద్భుతం గా చేసింది. వెన్నెల కిషోర్ ఉన్నంతలో పర్వాలేదు. 
మ్యూజిక్ గోవింద్ వసంత ఒరిజినల్ 96 సంగీతాన్నే కంటిన్యూ  చేసాడు. కెమెరా చాలా బాగుంది.
 96 తమిళ్ వెర్ష‌న్ చూడనివారికి జాను పర్వాలేదు అనిపిస్తుంది. 
చివరగా... 'జానూ'  వెయిటింగ్ ఫర్ అమె'జాను'

రేటింగ్ - 3.0