12నుంచి పున:ప్రారంభం కానున్న ప్రజాసంకల్పయాత్ర..!!

0
183
Ys Jagan Prajasankalpa Yatra

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్రను నవంబర్‌ 12 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయంలో గత నెల 25న వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో వైద్యులు ఆయనకు చికిత్స చేసి విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో పాదయాత్రకు విరామం ప్రకటించారు. గాయం నుంచి కోలుకున్న వైఎస్‌ జగన్‌ ముందుగా ప్రకటించిన విధంగా ఇచ్ఛాపురం వరకు తన పాదయాత్రను కొనసాగిస్తారని రఘురాం వెల్లడించారు. ఈ నెల 12 న విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ నుంచి పాదయాత్ర పున: ప్రారంభం కానుందని పేర్కొన్నారు.