తెలుగు దేశం పార్టీ ని తీవ్రంగా విమర్శిస్తూ జనసేన ఫ్లెక్సీలు..!!

0
154
Janasena Flexies

తెలుగుదేశం పార్టీ ని తీవ్రంగా విమర్శిస్తూ విజయవాడ నగరంలో ఓ జనసేన ఫ్లెక్సీ బుధవారం వెలిసింది. టీడీపీపై ఉన్న వ్యతిరేకతను ఫ్లెక్సీల ద్వారా జనసేన కార్యకర్తలు ప్రదర్శించారు. ‘ పిచ్చి ముదిరిన పచ్చ పురాణం.. ఏం తమ్ముళ్లు వేధిస్తుందా..ఓటమి భయం, గుర్తుస్తోందా.. దశాబ్ధ ప్రతిపక్ష కాలం..!’ అంటూ ఫ్లెక్సీలో టీడీపీకి పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. 2009లో బెజవాడ గడ్డ మీద చంద్రబాబు జీరో..2014లో ఎలా అయ్యారు హీరో అని ప్రశ్నించారు. మీ నాయకుడి తంత్ర ఫలమా..? మా నాయకుడి కాళ్లు మొక్కిన ఫలమా..? అని తీవ్రంగా దుయ్యబట్టారు. 2019 ఓటమి భయంతోనే కాంగ్రెస్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఎల్లోమీడియాను కూడా ఫ్లెక్సీలో తీవ్రంగా విమర్శించారు. 2019లో టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పకపోతే తాము జనసైనికులమే కాదని సవాల్‌ విసిరారు. తెలుగు తమ్ముళ్లూ గోదావరిలో మొదలైంది మీకు కౌంట్‌డౌన్‌ అంటూ అమరావతి జనసేన పార్టీ అధికార ప్రతినిధి మండలి రాజేష్‌ పేరిట ఫ్లెక్సీ వెలిసింది.