ప్రజా పోరాట యాత్రకు సిద్దమైన జనసేనాని

0
343
janasena praja porata yatra

పవన్ కళ్యాణ్,ఒక స్పీచ్ తో ఎంతో మందికి స్పూర్తిని ఇవ్వగలరు,చాలా మందిలో ఆలోచన రేపగలరు,ఆవేశం రగల్చగలరు.2009 ఎన్నికల సమయంలో తన ఆవేశ ప్రసంగం తో అప్పటి కాంగ్రెస్ నాయకులని ముప్పుతిప్పలు పెట్టారు.2014 మార్చ్ 14న జనసేన పార్టీ ఆరంభ ప్రసంగం తో దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల యువత ఆకర్షితులయ్యారు అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.2014 ఎన్నికలో భారతీయ జనతా పార్టీ తో కూడిన తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించారు.అటువంటి జనసేనాని ప్రత్యేకహోదా విషయం లో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో గెలుపు దిశగా వెళ్తున్న ఎన్. డి.ఏ నుంచి బయటకు వచ్చారు,తర్వాత తె.దే.పా కి కూడా దూరం జరిగారు.2014 తర్వాత అప్పుడప్పుడు తళుకుమంటూ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవారు,అటువంటి పవన్ కళ్యాణ్ గతకొంత కాలంగా నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పుడు ఏకంగా 45 రోజుల పాటు ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభించారు.ఇక్కడ,పవన్ కళ్యాణ్ ఏ పర్యటన చేసిన కవరేజ్ ఇచ్చిన మీడియా ఛానల్స్ నేడు చూపించడం మానేశాయి,ఎప్పుడో ఒక బహిరంగ సభ పెడితే జనాలు రావటం సాధారణం,కానీ నిత్యం జనాల్లో ఉంటే తన నిజబలం తెలిసిపోవటం తథ్యం,ఒకప్పుడు అంటే అధికార పార్టీ తో మైత్రి మూలాన ఆయనకి కావాల్సినవన్ని శరవేగంగా దొరికేవి,కానీ ఇప్పటి పరిస్థితి వేరు,వీటన్నిటిని జనసేనాని ఎలా అధిగమిస్తారో చూడాలి.ఒక పక్క ప్రధాన ప్రతిపక్ష నేత వై.యెస్.ఆర్.సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ,నెల్లూరు,ఒంగోలు,గుంటూరు,కృష్ణ జిల్లాలని దాటి పశ్చిమ గోదావరి లోకి వచ్చేశారు,2000కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అంటే ఆయన ప్రజల్లో ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేక ప్రభావం కలిగించి వుంటారు,మరో పక్క శ్రీకాకుళం నుండి ఉత్తరాంధ్ర పర్యటన తో మరో పార్టీ అధినేత బయలుదేరుతున్నారు.ఇలా ప్రధాన రెండు పార్టీల నేతలు జనాల్లో ఉండటం అధికార పార్టీ కి నష్టం కలిగించడం ఖచ్చితం,కానీ ఏమేరకు అనేది చూడాలి!!ప్రజా పోరాట యాత్ర ప్రారంభిస్తున జనసేనాని ఏమి మాట్లాడబోతున్నారు,ప్రజల్లతో ఎలా మమేకం అవుతున్నారు అనేది చాలా కీలకం!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here