అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించిన బీజేపీ నేత కుమార్తె

jharkhand-missing-minor-daughter-of-bjp-leader-found-hanging

జార్ఖండ్‌లోని పలాము జిల్లాకు చెందిన బిజెపి నాయకుడి 16 ఏళ్ల కుమార్తె లలిమతి అడవిలో చెట్టుకు వేలాడుతూ బుధవారం కనిపించింది. జూన్ 7 ఉదయం ఈ బాలిక తప్పిపోయింది. మైనర్ బాలికను చంపడానికి ముందే ఆమె కళ్ళలో కారం చల్లి కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మృతదేహం చెట్టుకు వేలాడుతుండటం చూస్తుంటే ఇది ఖచ్చితంగా హత్యే అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఇదిలావుండగా, ఈ కేసుకు సంబంధించి 23 ఏళ్ల ప్రదీప్ కుమార్ సింగ్ ధనుక్ గా గుర్తించిన ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం జరిగిన ప్రదేశం నుండి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ కాల్ డేటా రికార్డ్స్  తరువాత ఈ అరెస్టు జరిగింది.

కాగా ఆ బాలిక 10 వ తరగతి చదువుతోంది.. బిజెపి నాయకుడి ఐదుగురు పిల్లలలో ఆమె పెద్దది. ఆమెను బుధవారం సాయంత్రం దహనం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ఆయనకు ఫోన్ చేసి సానుభూతి తెలియజేశారు.