సుహాసిని పోటీపై ట్విట్టర్ లో స్పందించిన ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

0
341
jr ntr and kalyan ram responded on nandamuri suhasini in twitter

కూకట్‌పల్లి నుంచి తెదేపా అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీపై ఆమె సోదరులు కల్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. ‘ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో మా తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారు. మా నాన్న హరికృష్ణ తెదేపాకు ఎనలేని సేవలందించారు. మా సోదరి సుహాసిని కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. సమాజంలో స్త్రీలు ఉన్నతమైన పాత్ర పోషించాలని నమ్మే కుటుంబం మాది.

కూకట్‌పల్లి అభ్యర్థిగా ఈ రోజు సుహాసిని నామినేషన్‌ వేయనున్నారు. ఈ ఉదయం ఆమె కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు.