నిర్మాత బన్నీవాసుకు వేధింపులు.. యువతి అరెస్టు

jubilee-hills-woman-arrested-who-harassing-producer-bunny-vasu

సినీ నిర్మాత బన్నీ వాసుపై సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్న యువతిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.. తాజాగా ఆమెను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. తనకు తాను సినీ నటిగా చెప్పుకుంటున్న సునీత బోయ గత కొంత కాలంగా మలక్‌పేట ప్రాంతంలో పుచ్చకాయలు విక్రయిస్తుంది. గతంలో ఈమెకు సినీ పరిశ్రమతో సంబంధాలు ఉండేవి. 

దీనిని ఆసరాగా చేసుకొని సినీ నిర్మాత బన్నివాసు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని తనను మోసం చేశాడంటూ ఆరోపించడం చేస్తోంది.. అంతేకాదు కొన్ని యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూ లు ఇచ్చి బన్నీ వాసుపై అసభ్య పదజాలంతో దూషించడం చేసింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌  లోని గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి వెళ్లి  రచ్చ చేయడంతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే ఆమెపై పలు కేసులు నమోదు అయ్యాయి.