400 ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం..మిస్ అయితే మరో 60 ఏళ్ల వరకు చూడలేం..!

Jupitor and saturn

400 ఏళ్ల తర్వాత  ఆకాశంలొ మహాద్భుతం జరగబోతుంది.  ఈ నెల 21న గురు, శనిగ్రహాలు అత్యంత దగ్గరగా రాబోతున్నాయి. రెండు పెద్ద గ్రహాలు ఒక్కటైపోయాయా అనిపించేంతగా దగ్గర దగ్గరగా ఉండి మనకు కనువిందు చేయనున్నాయి,. అంతే కాదు రెండూ కలిసి ఓ భారీ  నక్షత్రంలా దర్శనమివ్వనున్నాయి. దాదాపు 400 సంవత్సరాల క్రితం అంటే  1623న ఈ రెండు గ్రహాలు అత్యంత సమీపానికి వచ్చాయి. మళ్లీ డిసెంబర్ 21 న గురు, శనిగ్రహాలు ఒకదానికి ఒకటి అత్యంత సమీపంలోకి వచ్చే ఈ అద్భుతం ఖగోళ ప్రియులకు కనువిందు చేయనుంది. రెండు గ్రహాలు దగ్గర దగ్గరగా వచ్చినప్పుడు వాటి మధ్య దూరం 73.50 కోట్ల కిలో మీటర్లుగా మాత్రమే ఉంటుంది.  ఇదో గొప్ప మహా సంయోగమని   కోల్‌కతాలోని జేపీ  బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్ దేబీ ప్రసాద్ దురై  తెలిపారు.. ‘‘రెండు ఖగోళ వస్తువులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి దానిని భూమి నుంచి చూడగలిగితే దానిని సంయోగమని అంటారు. అదే శని, గురు గ్రహాలు ఇలా దగ్గరికి వస్తే దానిని ‘గొప్ప మహా సంయోగమని’ అంటారు’’ అని దేబీ ప్రసాద్ వివరించారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారూ సూర్యాస్తమయం తర్వాత చూడవచ్చని  దేవీ ప్రసాద్‌ దురై వెల్లడించారు.  ఇప్పుడు కనుక ఈ గొప్ప సంయోగాన్ని చూడడం మిస్సయితే మళ్లీ 15 మార్చి 2080 నాటికి గానీ చూడలేమని ఆయన చెప్పారు.కాబట్టి ఆకాశంలో జరిగే ఈ ఖగోళ అద్భుతాన్ని కనులారా వీక్షించండి..డోంట్ మిస్ ఇట్..మిస్ అయితే మరో 60 ఏళ్ల వరకు చూడలేం.