బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా సస్పెండ్

Kangana Ranaut's Twitter account suspended for violating rules

వరుస వివాదాస్పద ట్వీట్ల నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఖాతాను ట్విట్టర్ యాజమాన్యం సస్పెండ్ చేసింది . పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వరుస వివాదాస్పద ట్వీట్లలో ఆమె అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఆదివారం (మే 2) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత రాష్ట్రంలో జరిగిన హింసకు నటి మమతా బెనర్జీని నిందిస్తూ..  రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.. అంతేకాదు 2000 ల ప్రారంభంలో మాదిరిగానే మమతా బెనర్జీని 'నియంత్రించాలని' ఆమె ప్రధాని నరేంద్రమోదీని విజ్ఞప్తి చేస్తున్నట్లు కూడా తన ట్వీట్లలో వ్యాఖ్యానించారు.