రెండో ఏడాది కాపునేస్తం నిధులు జమ

kapu-nestham-second-year-row-andhra-pradesh

వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం  అమలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి  జమ చేశారు. పథకం ద్వారా గత ఏడాది 3,27,349 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.491.02 కోట్లు జమ చేయగా, నేడు 3,27,244 మంది పేద కాపు మహిళలకు అందిస్తున్న రూ.490.86 కోట్లతో కలిపి మొత్తం రూ.981.88 కోట్ల లబ్ధి కలిగింది.