రాహుల్ ఫోటో చూస్తె నాకు డేటింగ్ చెయ్యాలనిపించింది – కరీనా కపూర్

0
411
రెఫ్యూజీ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కరీనా కపూర్ అప్పట్లో చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ సెలబ్రిటీ సిమీ గెరేవాల్ నిర్వహించే రెండెజ్వస్ టీవీ షోలో తన మనసులో మాట బయటపెట్టేశారు కరీనా. తనకు రాహుల్ గాంధీతో డేటింగ్ చెయ్యాలని కోరికగా ఉందన్నారు. తన మాటలు వివాదాస్పదం అయినా పర్వాలేదన్న కరీనా… రాహుల్ ఫొటోలు చూసినప్పుడు తనకు ఆ ఫీలింగ్ వచ్చిందని చెప్పారు. ఇదంతా గతం. సైఫ్ అలీఖాన్ పటౌడీని వివాహం చేసుకున్న తర్వాత ఈ ఊసే ఎత్తలేదు కరీనా కపూర్. ఆ షో గురించి కూడా చాలా మంది మర్చిపోయారు. కానీ ఎన్నికల సమయంలో కరీనా కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. ఎందుకంటే… మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోక్ సభ సీటు నుంచి కరీనా కపూర్ ను దింపాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. స్వయంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలే ఈ ప్రపోజల్ తీసుకొచ్చారట. ఎందుకంటే… 1989 నుంచీ భోపాల్ లోక్ సభ సీటు బీజేపీ గెలుస్తూనే వస్తోంది. దీన్ని గెల్చుకోవడం కాంగ్రెస్ పార్టీ వల్ల కావడం లేదు. అభ్యర్ధులు ఎవరైనా అక్కడి జనం మాత్రం బీజేపీనే గెలిపిస్తున్నారు. తాజాగా ఈ సీటు నుంచి నాటి తార మాధురీ దీక్షిత్ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారం జరిగింది. దీంతో మాధురీ చరిష్మాను ఎదుర్కొనే సత్తా కరీనా కపూర్ కే ఉందని రాహుల్, ప్రియాంకలు భావించారట. అందుకే ఆమె పేరు తెర మీదకు తెచ్చారు. ఇక తన పేరు బయటకు రావడంపై క్లారిటీ ఇచ్చారు మాధురీ దీక్షిత్. తాను రాజకీయాలకు చాలా దూరం అని తేల్చి చెప్పేశారు. అయితే కరీనా కపూర్ మాత్రం ఎక్కడ ఖండించలేదు. సరికదా… తన మామ మన్సూర్ అలీఖాన్ పటౌడీ పర్మిషన్ ఇస్తే తనకు ఓకే అంటూ సిగ్నల్ పంపారు. ఎందుకంటే పటౌడీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. ఇదంతా ఒక ఎత్తయితే… కరీనా పేరు బయటకు రావడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు అసంత్రుప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గమనించే… తనకు రాహుల్ మీద ఎంత క్రష్ ఉందో చెప్పడానికి… అప్పటి ఇంటర్వ్యూలోని డైలాగును స్వయంగా కరీనా కపూరే బయట పెట్టారన్న వాదన వినిపిస్తోంది. ఇలా చేస్తే… ఏ కాంగ్రెస్ పార్టీ నేత నోరు మెదపరు. అందరూ తన విజయం కోసం కష్టపడతారన్నది కరీనా ఆలోచనగా చెబుతున్నారు. అంటే ఈ ఎన్నికల్లో భోపాల్ లోక్ సభ సీటు నుంచి పోటీకి కరీనా కపూర్ రెడీగా ఉందన్న విషయం అర్థం అవుతోంది.