మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు

karimnagar-munciff-megistrate-directs-file-case-rs-praveen-kumar

మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని కరీంనగర్‌ మున్సిఫ్‌ జడ్డి ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకపూర్ (ధూళికట్ట) గ్రామంలో జరిగిన స్వేరోస్ భీమ్ దీక్ష సమయంలో హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ మార్చి 16న న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి ప్రవీణ్‌కుమార్‌పై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. మాజీ ఐపీఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదుకు కరీంనగర్‌ మూడో పట్టణ పోలీసులకు న్యాయమూర్తి   ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు అయింది.