రాజకీయాల్లోకి వంటలక్క.. తెలుగు రాష్ట్రాల్లో..

karthika-deepam-premi-viswanath-aka-vantalakka-to-enter-politics

వంటలక్క గా పేరొందిన కార్తీక దీపం ఫేమ్ ప్రీమి విశ్వనాథ్ రాజకీయాల్లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నివేదికల ప్రకారం, ఇటీవల కార్తీక దీపం టీవీ సీరియల్ నిర్మాతతో యూట్యూబ్ ఛానెల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, కేరళకు చెందిన ఈ నటి కేరళ రాష్ట్ర రాజకీయాలపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది..

రాజకీయాలతో సంబంధం కలిగి ఉండాలనే కోరిక ఉందన్నారు. 'నాకు తెలుగు రాష్ట్రాల నుండి టికెట్ ఇస్తే రాజకీయాల్లో చేరడం నాకు చాలా ఇష్టం' అని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చింది. ఈ వార్త ఇప్పుడు వైరల్ అయ్యింది. ప్రీమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క తెలుగు టీవీ పరిశ్రమలో ప్రసిద్ధిగాంచింది. ఆమెకు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.