ధోనికి 35 అడుగుల కటౌట్‌..!!

0
267
Dhoni 35Feets Cutout

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. అయితే ధోనిపై ఉన్న అభిమానాన్ని కేరళ ఫ్యాన్స్‌ వినూత్నంగా చాటుకున్నారు. భారీ ఎత్తుగల కటౌట్‌ను రూపొందించారు. ‘ఆల్‌ కేరళ ధోని ఫ్యాన్స్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో వన్డే మ్యాచ్‌ జరగనున్న గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియం బయట 35 అడుగుల ఎత్తైన ధోని కటౌట్‌ను ఏర్పాటు చేశారు. కటౌట్‌ ఏర్పాటుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘తలైవా విశ్వరూపం రెడీ అవుతోంది’ అని ట్వీట్‌ చేసింది. ఈరోజు విండీస్‌-భారత్‌ జట్ల మధ్య ఆఖరిదైన ఐదో వన్డే తిరువనంతపురంలో జరుగనుంది. దీనిలో భాగంగానే ధోని కటౌట్‌ను స్టేడియం బయటం ఏర్పాటు చేశారు అభిమానులు.