నా ప్రాణాలకు హాని : రేవంత్‌రెడ్డి

0
157
Revanth reddy

కొడంగల్‌ నియోజకవర్గం అభ్యర్ధి అనుముల రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా అటు రాజకీయాల్లోనూ,ఇటు మాటల్లోనూ దిట్ట. ఎదుటి వారిని ఆకర్షించేలా ప్రసంగాలు చేస్తూ ప్రజాదరణ పొందుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో కొనసాగే అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు.ప్రస్తుతం తన ప్రాణాలకు హాని ఉందని,తనకు రక్షణగా వచ్చిన ముఫ్తీ పోలీసులు అతన్ని దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని తన జీవితానికి ముప్పు ఉందని అన్నారు. డి.జి.పి మహేందర్ రెడ్డి మరియు ఐ.జి. ప్రభాకర రావు తో కలిసి టి.ఆర్.ఎస్ పార్టీ నేతలు దాడి చేయుటకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తమిళనాడులోని ఆర్కేనగర్‌ తరహాలోనే తెలంగాణలో కొడంగలల్‌ ఎన్నికను కూడా వాయిదా వేయించడానికి టీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాకూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.