కె టి ఆర్ ను కడిగేసిన కొండా సురేఖ!!

0
144
konda surekha
కొండా కుటుంబం తెలంగాణ రాష్ట్రం లో ఒక బలమైన రాజకీయ కుటుంబం.మొదట కాంగ్రెస్ లో వున్నా వీరు రాజశేఖర్ కుటుంబానికి విధేయులుగా పని చేసారు,2011లో జగన్ తో పాటు వైస్సార్సీపీ లో చేరారు.కానీ ఆ తర్వాత జగన్ సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకోవడం తో పార్టీ వీడారు.ఆ తర్వాత కేటీఆర్ పిలవడం తో తెరాస లో చేరారు ఈ దంపతులు.కానీ 2014 ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వారికీ పార్టీ లో వరస అవమానాలు ఎదురవుతూ వచ్చాయి.అన్ని పార్టీ కోసం భరించారు.కానీ మొన్న కెసిఆర్ విడుదల చేసిన 105 మంది అభ్యర్థుల జాబితా లో కొండా సురేఖ పేరు ఆపడం తో వివాదం మరింత పెద్దది అయింది.ఇది మా సొంత కల్పితం కథ కాదు సాక్షాతూ కొండా సురేఖ,కొండా మురళి మీడియా తో చూపిన మాటలు.అంటే కాక  కేటీఆర్ ఒక కోటరీ తయారు చేస్తున్నట్లు తెలిపారు.మమల్ని మోసం చేసింది,మాకు టికెట్ ఆపడానికి కారణం కేటీఆర్ అంటూ మండిపడారు కొండా సురేఖ.పార్టీ మాకు టికెట్ ఆపడానికి గల కారణం తెలిపిన తర్వాత మా వైఖరి తెలుపుటాం అని కూడా చెప్పారు.ఇప్పుడే ఇంతటి స్థాయి లో అభియోగాలు చేస్తే ఒక వేళ వీరు పార్టీ వీడితే కేటీఆర్ను చీల్చి చందాడటం కాయం గా కనపడుతుంది.ఈ సెగ కొండా దంపతులతో ఆగుతుందా లేక మరింత మంది పార్టీ నుండి వీడుతారా అనేది మరి కొన్ని రోజుల్లో తెలియనుంది.