రేపు నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో కేటీఆర్ రోడ్‌షోలు

0
260
ktr roadshow in hyderabad

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఓవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచార సభలతో హోరెత్తిస్తుంటే.. ఇటు యువనేత కేటీఆర్ కూడా బరిలోకి దిగుతున్నారు. బుధవారం నుంచి గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు కేటీఆర్ రోడ్ షో షెడ్యూల్‌ను విడుదల చేశారు.

కేటీఆర్ రోడ్ షో షెడ్యూల్..

21- ఉప్పల్, మల్కాజ్ గిరి

22- మహేశ్వరం, ఎల్బీ నగర్
23- కంటోన్మెంట్, సికింద్రాబాద్
24- సనత్ నగర్, జూబ్లీహిల్స్
26- కుత్భుల్లాపూర్, కూకట్ పల్లి
27- గోషామహల్, ఖైరతాబాద్
28- శేరిలింగంపల్లి, పటాన్ చెరు
29- అంబర్ పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.