లక్ష్మీస్ ఎన్టీఆర్ తో తెలుగుదేశం నేతల్లో మొదలైన వర్మ వణుకు

0
434

రాంగోపాల్ వర్మ తాజా మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్. మార్చి 22వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమా మీద జనం ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలు అన్న ట్యాగ్ లైన్… అటు జనాలను, ఇటు తెలుగుదేశం పార్టీ నేతలను ఊరిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు లీడింగులో టీడీపీ ఎలా మారింది, ఎన్టీఆర్ మీద వెన్నుపోటు రాజకీయం ఎలా జరిగిందీ… ఇలా అన్నీ అంశాలను తెరకెక్కించారు వర్మ. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్, సాంగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చంద్రబాబు మీద డైలాగులు, ఆయన ఫేస్ ఫీలింగ్సును తనదైన శైలిలో చిత్రీకరించారు వర్మ. ఇది కూడా టీడీపీ నేతలకు ఇబ్బందిగా మారింది. ఇదంతా ఓ ఎత్తయితే… లక్ష్మీపార్వతి కోణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ తీశారనేది ముఖ్యంగా బయ్యర్ల అనుమానం. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారన్న టెన్షన్ మొదలైందట.

అంతేకాదు… ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటం కూడా బయ్యర్లను గుబులు పుట్టిస్తోందట. దీంతో కొన్ని ఏరియాల్లో ఈ మూవీ కొనేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదట. అయితే ట్రైలర్, సాంగ్ హిట్ కావడంతో… కొంత మంది బయ్యర్లు ఎంత పెట్టి అయినా సినిమా కొనడానికి ముందుకు వస్తున్నట్లు కూడా టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. కొంత మంది మాత్రం… సినిమా రిలీజ్ డేట్ ను మార్చమని వర్మను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే… లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ డేటుకు కొంచెం అటూ ఇటూగా సువర్ణ సుందరి, అల్లు శిరీష్ ఏబీసీడీ, ప్రేమ కథాచిత్రం 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఆ సినిమాల ప్రభావం లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద పడుతుందనేది బయ్యర్ల భయం. అందుకే రిలీజ్ డేట్ మార్చమని వర్మను కోరుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఎన్ని సినిమాలు వచ్చినా తన మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని వర్మ బయ్యర్లకు హామీ ఇచ్చారట. ఇదంతా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం అయినా… ఏపీ తెలుగుదేశం నేతల్లో వర్మ వణుకు మొదలైంది. ఈ సినిమా చూసిన తర్వాత జనం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో, చంద్రబాబుతో పాటు తమ పొలిటికల్ సీన్ ఎలా మారుతుందన్న భయం పట్టుకుంది.