ఈ ఏడాది చిట్ట చివరి చంద్రగ్రహణం ఏర్పడేది రాత్రిపూట కాదు..ఏ రోజు...ఎప్పుడంటే..!

lunar eclipse

చంద్రగ్రహణం అనేది సాధారణంగా ఎక్కువ శాతం రాత్రి పూటనే ఏర్పడుతోంది. చాలా అరుదుగా మధ్యాహ్న సమయంలో ఏర్పడుతోంది.  మధ్యాహ్నం ఏర్పడే చంద్రగ్రహణం మన కంటికి కనిపించదు. ఈ ఏడాది చిట్ట చివరి చంద్రగ్రహణం కూడా రాత్రిపూట కాకుండా మధ్యాహ్న సమయంలోనే ఏర్పడుతోంది. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం నవంబర్ 30న అంటే కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడనుంది. ఈసారి ఏర్పడే చంద్రగ్రహణం ఉపఛాయ చంద్రగ్రహణం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ చంద్ర గ్రహణం మధ్యాహ్న సమయంలో ఏర్పడడం వల్ల మన కంటికి కనిపించదని...అందుకే దీనిని ఉపఛాయ చంద్రగ్రహణం అని పిలుస్తారని శాస్త్రవేత్తలు అంటున్నారు.  ఈ ఉపఛాయ చంద్రగ్రహణం నవంబ‌ర్ 30న మ‌ధ్యాహ్నం సమయంలో ప్రారంభ‌మై సాయంత్రం వరకు ఉంటుందని వారు తెలిపారు. ఈ నెల 30 న ఏర్పడే ఈ ఉపఛాయ చంద్రగ్రహణం మధ్యాహ్నం 1:04 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 5:22 గంటలకు ముగుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది ఏర్పడే చివరి చంద్రగ‌్రహణం అనేది కంటికి కనిపించకపోవడంతో ఖగోళ శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు, నిరుత్సాహానికి గురవుతున్నారు.