కూలిన ఇల్లు.. 11 మంది మృతి

At least 11 dead, several injured after wall collapses in Mumbai

కొన్ని రోజులుగా ముంబైలో కురుస్తున్న వర్షాలకు పాత ఇళ్ళు కూలుతున్నాయి.. తాజాగా ఇళ్ళు  కూలిపోవడంతో 11మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని చెంబూర్ జిల్లాలోని భారత్ నగర్ లో జరిగింది. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని శిధిలాల కింద చిక్కుకున్న 16 మందిని రక్షించారు.

నివేదికల ప్రకారం, ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో చాలా మంది శిధిలాల కింద చిక్కుకున్నారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిరంతర వర్షపాతం కారణంగా నగరంలో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.