ఆదాయాన్నిచ్చే సినీ రంగాన్ని..ప్రజలకోసమే వదులుకున్నా:పవన్

0
196
pawan kalyan leaving film industry for peoples

తనకు జ్వరంగా ఉన్నా జనాల కోసమే గ్రామాల్లో తిరుగుతున్నానని.. ముసుగుతన్ని పడుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తనకు సినిమా రంగంలో ఆదాయం బాగుందని, ఇటీవలే రూ.25 కోట్లు ఆదాయపు పన్ను కట్టానని చెప్పారు. కానీ దానిని కాదని ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో పర్యటించిన జనసేనాని… ఇంతమంది జనం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. జనసేన పోరాటయాత్ర జిల్లాలోని పాయకరావుపేట, అచ్యుతాపురం మండలం పూడిమడక, యలమంచిలి పట్టణాల్లో పర్యటించారు. యలమంచిలి ఎమ్మెల్యే రమేష్ బాబు అక్రమ మైనింగ్‌ చేస్తూ రోజుకి రూ.6 లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపించారు పవన్. ఆయనకు ఆదాయంపై ఉన్న ఆసక్తి ప్రజా సమస్యలు పరిష్కరించడంపై కనిపించడం లేదని ఫైర్ అయ్యారు.

చంద్రబాబు పాలనలో నారా లోకేష్‌కు తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదన్నారు. భూములు తీసుకునేటప్పుడు 60 వేలమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కంపెనీలు ఎంతమందికి ఇచ్చాయని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎందుకు చంద్రబాబు నిలదీయడం లేదన్నారు. కాలుష్యాన్ని విరజిమ్ముతూ పైపులైన్‌ ద్వారా కలుషిత నీటిని సముద్రంలోకి వదులుతున్నారన్నారు. దీంతో మత్యకారులకు..ఇటు పరిశ్రమల్లో ఉపాధి లభించకపోగా అటు మత్యసంపద చనిపోయి ఉపాధి కోల్పోతున్నారన్నారు. పూడిమడక గ్రామస్థులు ఇలాగే నష్టపోయారన్నారు. రాంబిల్లి మండలంలో ప్రత్యామ్నాయ నావికా స్థావరం (NAOB) నిర్మాణానికి వేలాది ఎకరాల భూములను తీసుకున్న ప్రభుత్వం ఇక్కడ నిర్వాసితుల కోసం కేంద్రీయ విద్యాలయం, ప్రత్యేక ఆస్పత్రి నిర్మిస్తామని చెప్పి ఇంత వరకూ ఒక్కటీ చేయలేదన్నారు. ఉపాధి కూడా కల్పించలేదన్నారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల సమస్యలను పట్టించుకోనందన మూడో పార్టీ అవసరం ఏర్పడిందని.. అందుకే జనసేన పార్టీ పుట్టిందన్నారు పవన్.

[penci_related_posts taxonomies=”undefined” title=”Related Posts” background=”” border=”” thumbright=”no” number=”4″ style=”list” align=”none” displayby=”cat” orderby=”random”]

సమస్యలపై బలంగా మాట్లాడి… నిలదీసి జనసేన ప్రభుత్వాన్ని నెలకొల్పుదామన్నారు. యలమంచిలిలో కొనసాగిస్తోన్న జనపోరాట యాత్రలో ఆయనకు ఓ మత్స్యకారుడు చేపలు పట్టే వలను బహూకరించారు. అలాగే, తాటాకులతో తయారు చేసి వారిచ్చిన టోపీని పవన్‌ తలకు ధరించారు. టీడీపీలోని అవినీతి చేపలను ఈ వలతో పట్టుకుని బయటవేసేద్దామని అన్నారు జనసేనాని. ఉప్పుచేపల్లా ఎండబెడదామన్నారు. గత పుష్కరాల్లో నిధుల దుర్వినియోగాన్ని గురించి తాను రాజమహేంద్రవరం పర్యటనలో బయటపెడతానని చెప్పారు. పవన్‌ పర్యటన సందర్భంగా ఎలమంచిలి పట్టణంలో అన్నివీధులు జనంతో కిక్కిరిసిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here