ఇలా 2 నిమిషాల్లో మీ పాన్‌కార్డుకు ఆధార్‌‌ కార్డును లింక్‌ చేసుకోండి..!

pan card

మీకు పాన్ కార్డు ఉందా..అయితే వెంటనే మీ పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేసుకోండి..లేకపోతే మీ పాన్ కార్డు రద్దు అయిపోతుందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు పాన్ కార్డుకు ఆధార్ లింక్‌ గడవును ఐటీశాఖ పొడిగించింది.  అయితే పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయాలంటే మీ సేవ లేదా..ప్రైవేట్‌ పాన్ కార్డు సర్వీసులు అందించే సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు...జస్ట్ మీ దగ్గర సిస్టమ్ లేదా ఫోన్ ఉంటే చాలు...2 నిమిషాల్లో పాన్ కార్డును లింక్ చేసుకోవచ్చు...ఎలా అంటారా..ముందు మీ ఆధార్, పాన్ కార్డులలో   మీ పేరు, పుట్టిన తేదీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.  ఆ తర్వాత మొదటిగా ఇన్‏కమ్ ట్యాక్స్ వెబ్‏సైట్‌కు వెళ్లండి...తొలి పేజీలో పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నంబర్లు, ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరు ఇవ్వాలి. ఆ తర్వాత ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటేయిల్స్ విత్ UIDAI చెక్ బటన్ మీద్ క్లిక్ చేయాలి. దాని కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. అంతే క్షణాల్లో మీ ఆధార్, పాన్ కార్డులు అనుసంధానం అవుతాయి. ఇక మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ అయితే ఐటీ రిటర్న్స్ వంటి సేవలు సులభతరం అవుతాయి.