ఈ ఐదు సలహాలు పాటిస్తే మంత్రి నారా లోకేష్ కచ్చితంగా రాజకీయాల్లో నెగ్గుకు వస్తారట!

0
355

మంత్రి నారా లోకేష్ కు ఐదు సలహాలు ఇస్తున్నారు రాజకీయ పండితులు. ఇవి పాటిస్తే ఆయన కచ్చితంగా రాజకీయాల్లో నెగ్గుకు వస్తారట. ముందుగా పదవి వారసత్వంగా వచ్చింది అన్న ముద్ర లోకేష్ పోగొట్టుకోవాలి. అంటే… కేవలం చంద్రబాబకు కుమారుడు అవ్వడం వల్లే ఆయనకు మంత్రి పదవి వచ్చిందనీ, అంతకు మించి లోకేష్ దగ్గర ఏ టాలెంట్ లేదన్న వైరి పార్టీల ఆరోపణలను తిప్పికొట్టాలి. ఇందుకు లోకేష్ తానేంటో నిరూపించుకోవాలి.

ఇక రెండో విషయం… మాట తీరు. ఏం మాట్లాడాలో ముందుగానే తెల్సుకోవడం. ఏ రాజకీయ నేతకైనా మాట్లాడటం అనేది కల్సొచ్చే అంశం. తన ప్రసంగాలతో జనాన్ని ఆకట్టుకునేలా మాట్లాడి సొంత ఓట్ బ్యాంక్ పెంచుకుంటారు. జనంలో బలమైన నేతగా ఎదుగుతారు. కానీ లోకేష్ ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఒక్కోసారి ఆయన ప్రసంగాల్లో విషయం ఉండదు, సరికదా… తప్పులు ఉంటాయి. గతంలో జయంతికీ, వర్థంతికీ తేడా తెలీయకుండా మాట్లాడి జనంలో అభాసుపాలయ్యారు లోకేష్. మరోసారి సొంత పార్టీని కులగజ్జి పార్టీ అంటూ తిట్టారు. ఆయన తిట్టాలనుకుంది వైసీపీని, కానీ తిట్టింది టీడీపీని. ఇలా లోకేష్ మీద చాలా కామెడీలు ఉన్నాయి. అందుకే మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైరి పార్టీలకు ఏమాత్రం ఆరోపణ చేసే అవకాశం ఇవ్వకూడదు. మాట్లాడే ముందు సందర్భం ఏంటో తెల్సుకోవాలి.

ఇక మూడో లోపం… అడ్డదారిని ఎమ్మెల్సీ పదవి పొంది, ఆ తర్వాత మంత్రి అయ్యారనేది లోకేష్ మీద వైసీపీ చేస్తున్న మరో ఆరోపణ. అంటే ఇప్పుడు ఆయన కచ్చితంగా ఏదో ఒక అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి, తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. ఇక ఎన్నికల సమయంలో సమీక్ష, పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో లోకేష్ జరిపిన మంత్రాంగం బెడిసి కొట్టింది. ఈసారైనా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే రాజకీయాలు, సామాజిక పరిస్తితుల మీద అవగాహన బాగా పెంచుకోవాలి.

ఇక కోటరీ మీద పూర్తిగా ఆధారపడటం లోకేష్ దగ్గరున్న మరో మైనస్ పాయింట్. కోటరీని పెంచుకుంటూ పోతూనే, సొంతంగా తాను కూడా దూసుకుపోయేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే కోటరీ బలంగా ఉంటుంది. కొందరు నేతలు తోక జాడించకుండా ఉంటారు. ఇవన్నీ జాగ్రత్తగా పాటిస్తే లోకేష్ కు చంద్రబాబు తరహా పాలిటిక్స్ నడపగల సత్తా వస్తుందనేది రాజకీయ పండితులు అభిప్రాయం.