నేడు బలపడనున్న అల్పపీడనం.. కోస్తా, రాయలసీమలో వర్షాలు

low-pressure-formed-bay-bengal-strengthening

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం తీవ్రరూపం దాల్చి రానున్న మూడు రోజుల్లో పశ్చిమ దిశలో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్‌ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుందని వివరించారు. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తా ప్రాంతాల్లో ఎక్కువగానూ, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.