ముఖ్యమంత్రి విధుల్లో జోక్యం చేసుకోలేం.. పిటిషన్ దారునికి 10వేల జరిమానా..

madras-hc-junks-plea-seeking-directions-to-officials-not-to-disturb-cm-mk-stalin-on-sundays-slaps

అసాధారణ పరిస్థితులలో తప్ప ఆదివారాలు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు భంగం కలిగించవద్దని తమిళనాడు ముఖ్య కార్యదర్శి, ఇతర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఊహించన విధంగా మద్రాస్ హైకోర్టు ఈ పిటిషన్ను హాస్యాస్పదంగా పేర్కొంది,  "ఇది పూర్తిగా హాస్యాస్పదమైన పిటిషన్, ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించే ముందు చాలాసార్లు ఆలోచించి ఉండాల్సి ఉందని చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ మరియు జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి ధర్మాసనం పేర్కొంది.

ఇది ప్రభుత్వ అధినేతకు, అధికారులకు మధ్య ఉన్న విషయమని కోర్టు తెలిపింది. "ఫైల్స్ ఎలా ముఖ్యమంత్రి ముందు ఉంచాలి, ముఖ్యమంత్రి ఎలా పని చేస్తారనేది పూర్తిగా ప్రభుత్వ అధిపతి, అధికారుల మధ్య ఉన్న విషయం. అటువంటి విషయాలలో కోర్టు జోక్యం చేసుకోదు ఇకపై ఇటువంటి పనికిరాని పిటిషన్లు దాఖలు చేయరని భావిస్తున్నాం అని తీర్పులో తెలిపింది.

ఇక ఈ పిటిషన్ దాఖలు చేసినందుకు పిటిషనర్‌కు హైకోర్టు 10,000 రూపాయల జరిమానా విధించింది. ఈ జరిమానాను COVID-19 ను ఎదుర్కోవటానికి ఉపయోగం కోసం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు వాడాలని కోర్టు సూచించింది.