‘సర్కార్’పై ప్రశంసలు కురిపించిన మహేశ్‌బాబు..!

0
215
sarkar

సర్కార్‌’ సినిమాపై సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించారు. సినిమాలో మురుగదాస్‌ మార్క్‌ స్పష్టంగా కనిపించిందిన ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘ ‘సర్కార్’..అద్భుతమైన పొలిటికల్‌ డ్రామా చిత్రం. సినిమాను చాలా బాగా ఎంజాయ్‌ చేశాను. సినిమాలో మురుగదాస్‌ మార్క్‌ స్పష్టంగా కనిపించింది. చిత్రబృందానికి శుభాకాంక్షలు’ అని మహేశ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.‌

మహేశ్‌-మురుగదాస్‌ కాంబినేషన్‌లో ‘స్పైడర్‌’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ‘సర్కార్‌’ చిత్రంలో విజయ్‌ కథానాయకుడిగా నటించారు. కీర్తిసురేశ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కథానాయికలుగా నటించారు. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. మంగళవారం విడుదలైన ఈ చిత్రం వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది. తమిళనాడులో తొలిరోజే ఈ చిత్రం రూ.30 కోట్లు రాబట్టింది. ఇక ఓవర్‌సీస్‌లోనూ హాలీవుడ్‌ సినిమా రేంజ్‌లో దూసుకెళ్తోంది.