మే 5న బెంగాల్ ముఖ్యంమత్రిగా మమత ప్రమాణస్వీకారం

Mamata Banerjee to take oath as West Bengal CM for the third term on May 5

మే 5, బుధవారం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోమవారం కోల్‌కతాలో జరిగిన పార్టీ సమావేశంలో టిఎంసి శాసనమండలి నాయకురాలిగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మమతా కొత్త క్యాబినెట్‌లోని మంత్రులు, ప్రో-టెమ్ స్పీకర్ సుబ్రతా ముఖర్జీ మే 6న  ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 

ఆ తరువాత బిమాన్ బెనర్జీని స్పీకర్ గా ఎన్నుకుంటారని వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించిన తరువాత మమతా నిన్న రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్ ను కలుసుకున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎనిమిది దశల్లో పోలింగ్ జరిగిన 292 సీట్లలో 212 స్థానాలను పాలక టిఎంసి గెలుచుకుంది.. 77 సీట్లతో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.