జనవరి 19న బీజేపీయేతర పక్షాలతో భారీ సభ ..!

0
158
Mamata Banerjee

తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై పోరును మరింత ఉధృతం చేయబోతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిస్తున్న ఆమె.. జనవరి 19న బీజేపీయేతర పక్షాలతో భారీ సభ నిర్వహించబోతున్నారు. దీనిని కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో  నిర్వహిస్తున్నట్లు మమతా బెనర్జీ గురువారం ప్రకటించారు. ఇందులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డీఎంకే నేత స్టాలిన్‌, అఖిలేశ్‌యాదవ్‌, ఫరూఖ్‌ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్‌, హార్దిక్‌ పటేల్‌ సంసిద్ధత వ్యక్తం చేశారని వెల్లడించారు.