మద్యానికి బానిసైన భర్త.. ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్య

mass-suicide-in-chhattisgarh-chhattisgarh-woman-committed maranam

ఛత్తీస్‌గడ్ లోని మహాసముండ్‌లో బుధవారం రాత్రి ఒక మహిళ తన ఐదుగురు కుమార్తెలతో కలిసి రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. వారి మృతదేహాలు గురువారం ఉదయం రైల్వే ట్రాక్‌లో 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా కనిపించాయి. మహాసముండ్‌లో ఇమ్లిభంత కాలువ కల్వర్టు సమీపంలో రైల్వే ట్రాక్‌లో మృతదేహాలు పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. దాంతో కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. 

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. రైల్వే  అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా మరణించిన పిల్లలందరూ 10 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు వారని పోలీసులు గుర్తించారు. మద్యానికి బానిసై ఇంటిని పట్టించుకోని భర్త కారణంగా సదరు మహిళ తన కుమార్తెలతో సహా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.