అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్ చిరంజీవి

0
248
chiranjeevi act as alluri seetharama raju
మెగాస్టార్ చిరంజీవి, పిరియాడికల్ మూవీలో తెల్లదొరలను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర కూడా కనిపించబోతోందట.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరణానంతరం ఆయన స్ఫూర్తితో ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన వీరులలో అల్లూరి సీతారామరాజు ఒకరు. కాబట్టి ఈ పాత్ర కూడా సినిమాకు కీలకమేనని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం. అల్లూరి సీతారామరాజు వంటి పవర్‌ఫుల్ పాత్రకు చిరు అయితే సరిగ్గా సరిపోతారని భావించిన చిత్రబృందం ఆయనతోనే ఈ పాత్రను కూడా చేయించబోతోందని ఫిలింనగర్ టాక్. ఇది ఎంతవరకూ నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.