ఊపిరిపోస్తున్న ‘మేఘా’.. తమిళనాడుకు 3వేలకు పైగా ఆక్సిజన్ బెడ్స్

MEIL Establishes more than 3000 beds for the Covid affected in Tamilnadu

•    తమిళనాడు వ్యాప్తంగా 3000 పడకల కోవిడ్ ఆసుపత్రులు
•    గ్రేటర్ చెన్నైలోనే 1070 ఆక్సిజన్ బెడ్లు
•    కేవలోం 72 గంటల్లోనే 500 ఆక్సిజన్ బెడ్స్ ఆసుపత్రి ఏర్పాటు
•    తమిళనాడు ప్రభుత్వం, క్రెడాయ్, జి రియల్టర్స్ సహ‌కారం

మాన‌వ‌సేవ‌యే మాధ‌వ సేవ అన్నారు. ఆ సేవ‌ను పునికిపుచ్చుకున్న హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ క‌రోనాపై ప్ర‌భుత్వాలు చేస్తున్న యుద్ధంలో నేను సైతం అంటూ చేయి క‌లిపింది. క‌రోనా రోగుల‌కు మేమున్నామ‌నే భ‌రోసా క‌ల్పిస్తోంది. 

రొంబ సేవ‌...మేఘాకు వ‌ళ్‌టుక్క‌ల్‌

తెలుగు రాష్ట్రాల‌లో అనేక ఆసుప‌త్రుల‌కు ఉచిత ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తున్న మేఘా సంస్థ ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా ఉచితంగా 2500 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మదురైలో కేవలం 72 గంటల్లోనే 500 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేసింది. మేఘాతో పాటు తమిళనాడుకు చెందిన క్రెడాయ్, జి రియల్టర్స్ సంస్థ‌ ఇందులో పాలుపంచుకుంటున్నాయి. సీఎం ఎం.కె.స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని నేరుగా పర్యావేక్షిస్తున్నారు. మేఘా సామాజిక సేవ ప‌ట్ల  రొంబ సేవ‌...మేఘాకు వ‌ళ్‌టుక్క‌ల్‌* (గొప్ప సేవ చేస్తున్న మేఘాకు అభినంద‌న‌లు) అంటూ త‌మిళులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. 

చెన్నైలో 1070 ఆక్సిజన్ బెడ్లు

రాజధాని గ్రేటర్ చెన్నై పరిధిలోని ఆసుపత్రులలో 1070 ఆక్సిజన్ బెడ్ల ను  అందుబాటులోకి తేవ‌డానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ శరవేగంగా పనులు చేస్తోంది.  వీటితో పాటు ఈరోడ్ జిల్లాలో 200, వెల్లూరు 250, అంబూరు 100, నట్టారం వళ్లి 100, మెలిశ్వరం 100, అయ్యపాకం 200, శోలింగార్ 50, వనియంబాడిలో 100, వల్లఝాలో 100 ఆక్సిజన్ పడకల ఏర్పాట్లు  యుద్ధ ప్రాతిప‌దిక‌న జరుగుతున్నాయి. 

మేఘాకు తోడైనా క్రెడాయ్, జి రియల్టర్స్

మధురై ప్రభుత్వ ఆసుపత్రి (తోప్పూర్ జిహెచ్) లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ 500 స్కేలబుల్ ఆక్సిజనేటెడ్ బెడ్ సౌకర్యాలను మే 21 ప్రారంభించారు. ఇందులో 200 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వచ్చాయి.  మిగిలిన 300 పడకలు త్వరలో ప్రజల ఉపయోగం కోసం అందుబాటులో ఉంచనున్నారు. మేఘా సంస్థ చొరవతో ప్రజలకు ఉచిత చికిత్సను అందిస్తున్నారు. 

రికార్డు స‌మ‌యంలో 500 ఆక్సిజ‌న్ బెడ్ ఆస్ప‌త్రి
జి స్క్వేర్ రియల్టర్స్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, క్రెడాయి మదురై జిహెచ్ వద్ద 72 గంటల రికార్డు సమయంలో 500 ఆక్సిజన్ బెడ్ సౌకర్యాలను ఏర్పాటు చేశాయి. జి స్క్వేర్ రియల్టర్ తో కలిసి మేఘా ఇంజనీరింగ్ సంస్థ చెన్నై అన్నా నగర్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఒమాండురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కొక్కటి 100 ఆక్సిజనేటెడ్ పడకలను ఏర్పాటు చేశారు.  

సేవ‌ను బాధ్య‌త‌గా భావిస్తున్నాం- ఎంఈఐఎల్‌
కరోనా సమయంలో తమ వంతుగా దేశానికి సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నామని ఎంఈఐఎల్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించడానికి 200 పి.ఎస్.ఏ ప్లాంట్లు ఏర్పాటుతోపాటు, క్రయోజనిక్ ట్యాంకుల తయారీ కూడా ప్రారంభించినట్లు చెప్పారు. ఇందుకు డిఆర్డీవో, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో ప‌లు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్న సంగతిని గుర్తు చేశారు. తొలిసారిగా తెలంగాణకు థాయిలాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేసి ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తం వ్య‌వహారాన్నిఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డి ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు.