మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు పౌల్ అలెన్ కన్నుమూత

0
142
microsoft co-founder paul allen dies

మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, బిల్‌గేట్స్ బాల్యమిత్రుడు పౌల్ అలెన్(65) సోమవారం కన్నుమూశారు. లింఫోమా కేన్సర్‌తో అలెన్ తుదిశ్వాస విడిచారని ఆయన కంపెనీ వుల్కన్ తెలిపింది. నాన్-హడ్జ్‌కిన్ లింఫోమాకి చికిత్స తీసుకుంటున్నట్టు ప్రకటించిన రెండు వారాలకే అలెన్ మరణించారు. 9 ఏళ్ల క్రితం లింఫోమా కేన్సర్ బారి నుంచి ఆయన కోలుకున్నారు. కానీ వ్యాధి మళ్లీ తిరగబెట్టడంతో ప్రాణాలు విడిచారు.

బాల్యమిత్రుణ్ని కోల్పోవడం పట్ల బిల్ గేట్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్ననాటి స్నేహితుడిని కోల్పోవడంతో హృదయం ముక్కలైందన్నారు. పౌల్ లేకుండా పర్సనల్ కంప్యూటింగ్ లేదని గేట్స్ తెలిపారు. కంపెనీ, ఐటీ ఇండస్ట్రీకి అలెన్ చేసిన సేవలను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కొనియాడారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని సత్య తెలిపారు.