నేడు మంత్రులతో సహా స్టాలిన్ ప్రమాణస్వీకారం.. ఆయనకు హోమ్..

MK Stalin to be sworn in as CM of Tamil Nadu today

33 మంది మంత్రులతో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రిగా డిఎంకె నాయకుడు ఎంకె స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 9 గంటలకు చెన్నైలోని రాజ్ భవన్‌లో జరగనుంది. ఎమ్మెల్యేలను మంత్రులుగా నియమించాలని, వారి శాఖలకు సంబంధించి డిఎంకె చీఫ్ స్టాలిన్ చేసిన సిఫారసులను తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ గురువారం ఆమోదించారు.

స్టాలిన్.. జనరల్ అడ్మినిస్ట్రేషన్, హోమ్, స్పెషల్ ఇనిషియేటివ్స్, స్పెషల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, సామాజిక సంక్షేమంతో సహా మంత్రులకు కేటాయించిన ఇతర శాఖలను నిర్వహిస్తారు. చెన్నై మాజీ మేయర్ మా సుబ్రమణియన్‌కు మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పోర్ట్‌ఫోలియో కేటాయించగా, డిఎంకె ప్రధాన కార్యదర్శి ఎస్ దురైమురుగన్‌కు జల వనరుల శాఖ కేటాయించారు. ఉదయనిధి స్టాలిన్ సహాయకుడు అన్బిల్ మహేష్ పోయమోజికి పాఠశాల విద్యా శాఖ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.  234 మంది సభ్యుల అసెంబ్లీలో 133 సీట్లను డిఎంకె గెలుచుకుంది.