సినీ గేయ రచయిత కందికొండ ఆరోగ్యం విషమం

Movie songs writer Kandikonda's health is bad

ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ గిరి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన  త్రోట్ కాన్సర్ తో బాధపడుతున్నట్లు సమాచారం.. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో గత కొద్ది రోజులుగా ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా దేశముదురు, సంక్రాంతి పోకిరి, మున్నా, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, సమ్మక్క సారక్క పాట,  అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి వంటి ఎన్నో సినిమాలకు ఆయన పాటలు రాశారు. తెలంగాణ యాసలో సాగే పాటలు కూడా రాశారు.. కెరీర్లో దాదాపు పన్నెండు వందల పాటలు కందికొండ రాశారు.