రూ.11,11,111 చెక్కును తిత్లీ తుఫాన్‌ బాధితులకు విరాళం : మొవ్వా సత్యనారాయణ

0
185
movva satyanarayana

శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్‌తో భారీ ఆస్తినష్టాన్ని చవిచూడటంతో పాటు సర్వం కోల్పోయిన ప్రజలను చూసి శేరిలింగంపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకుడు మొవ్వా సత్యనారాయణ చలించిపోయారు. వారికి బాసటగా నిలవాలని భావించారు. శుక్రవారం అమరావతి వెళ్లి స్వయంగా ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి సీఎం సహాయ నిధికి రూ.11,11,111 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ తెలంగాణలో బడుగు బలహీన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆవిర్భవించిన పార్టీ అని, తెలుగువాళ్లు ఏ ప్రాంతంలో ఇబ్బందుల్లో ఉన్నా.. వారిని ఆదుకోవడానికి టీడీపీ అండగా ఉంటుందని మొవ్వా సత్యనారాయణ అన్నారు. తుఫాను బాధితుల సహాయార్థం కూకట్‌పల్లికి చెందిన కడియాల సుబ్బారావు.. చంద్రబాబును కలిసి రూ.లక్ష చెక్కు అందజేశారు. కష్టాల్లో ఉన్నవారికి సానుభూతితో సాయం చేసిన దాతలను చంద్రబాబు అభినందించారు.