నరసరావుపేట నుంచే మళ్లీ పోటీ చేస్తా…..కాబోయే ప్రధాని చంద్రబాబే..!!

0
231
TDP MP Rayapati Sambasiva Rao

ఎంపీ రాయపాటి సాంబశివరావు తను రానున్న ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభ నుంచి తిరిగి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.  గుంటూరులోని తన కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పోటీలో తాను లేనని, రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయనని వస్తున్న వార్తలను ఖండించారు.  నరసరావుపేట నుంచే తిరిగి ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. నరసరావుపేట నుంచే మళ్లీ పోటీ చేస్తా,గతంలో తక్కువ ఎంపీ సీట్లతోనే దేవగౌడ ప్రధాన మంత్రి పదవిని అధిరోహించారన్నారు. రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లను గెలిచి దేశంలో మూడో ఫ్రెంట్‌ను ఏర్పాటుచేసి చంద్రబాబు ప్రధాని అవుతారని అని తెలియజేశారు.