12 మంది ఎమ్మెల్యేల వేతనాలు నిలిపివేత

mumbai-salaries-12-bjp-mlas-have-been-suspended

వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో దురుసుగా ప్రవర్తించి సస్పెన్షన్ కు గురైన 12 మంది మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అంతేకాదు ఎమ్మెల్యేలు సస్పెన్షన్ లో  ఉన్నంత కాలం వారికి నెలనెలా చెల్లించాల్సిన గౌరవ వేతనంతోపాటు ఇతర భత్యాలు కూడా ఇవ్వకూడదని నిర్ణయించింది.. కాగా వేటు పడడంతో 12 మంది ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా ప్రభుత్వం ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు రూ.2,40,973 గౌరవ వేతనం చెల్లిస్తుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైనందుకు రోజుకు రూ.2 వేల భత్యం, అలాగే సమావేశాలకు హాజరైనందుకు రోజుకు రూ.2 వేలు చెల్లిస్తుంది.