ముందస్తు బెయిల్‌కి దరఖాస్తు : మురుగదాస్‌

0
138
Muragadoss

దర్శకుడు మురుగదాస్‌ లేటెస్ట్‌ చిత్రం ‘సర్కార్‌’తో తమిళనాడులో పొలిటికల్‌ పార్టీల ఆగ్రహానికి గురయ్యారని, అందుకే ఆయన్ను అరెస్ట్‌ చేయడానికి పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లారని సమాచారం. ఈ విషయాన్ని ‘సర్కార్‌’ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ‘మురగదాస్‌ని అరెస్ట్‌ చేయడానికి పోలీసులు ఆయన ఇంటివద్దకు వెళ్లారు’ అని ట్వీట్‌ చేశారు. ఆ వెంటనే ‘‘మా ఇంటికి పోలీసులు వచ్చారు. నేను లేనని తెలుసుకొని తిరిగి వెళ్లిపోయారు’ అని మురుగదాస్‌ ట్వీట్‌ చేశారు. ఈ పరిస్థితుల్లో మురుగదాస్‌ ముందస్తు బెయిల్‌కి దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్‌ 27 వరకూ ఆయన్ని అరెస్ట్‌ చేయకూడదని చెన్నై కోర్ట్‌ ఆదేశించింది. ఈ చిత్రాన్ని మళ్లీ సెన్సార్‌ చేసి, మూడు సన్నివేశాల్లో చిన్న కట్స్‌ చేయమని ఆదేశించారు.