ఘంటసాల కుమారుడు కన్నుమూత

music-composer-ghantasala-son-rathna-kumar-passed-away

సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు రత్నకుమార్‌ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కరోనా సోకగా, రెండు రోజుల క్రితమే కోవిడ్‌ నెగిటివ్‌ వచ్చింది. 

అయితే చాలా రోజులుగా ఆయనకు కిడ్నీ జబ్బు కూడా ఉంది. ఈ క్రమంలో చికిత్స తీసుకుంటుండగా గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. ఘంటసాల, సావిత్రి దంపతుల రెండో కుమారుడే రత్న కుమార్‌. ఈయన ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా చేశారు. రత్నకుమార్‌ ఆకస్మిక మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.