ప్రచారానికి రానున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..!!

0
274
Nandamuri Suhasini

తెలంగాణ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పేరు దాదాపు ఖరారైంది. గురువారం సీఎం చంద్రబాబును ఆమె విశాఖలో కలిశారు. కూకట్‌పల్లి టికెట్‌పై ఆమె చంద్రబాబుతో చర్చించారు. తాను పోటీకి సిద్ధమని చెప్పడంతో సుహాసినికే కూకట్‌పల్లి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు కూడా గత కొన్ని రోజులుగా ఈ స్థానాన్ని ఎవరికీ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. మహాకూటమిలో భాగంగా కూకట్‌పల్లి స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. అయితే టీడీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కూకట్‌పల్లి కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ ఆఖరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ సుహాసినికే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావించారు. కూకట్‌పల్లి టికెట్‌ ఆశించిన వారితో ఇవాళ చంద్రబాబు సమావేశం కానున్నారు. ఎన్టీఆర్‌ కుటుంబానికి టికెట్‌ ఇస్తుండటంతో అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరనున్నారు. హరికృష్ణ మృతి తర్వాత ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఒకరికి అవకాశం కల్పించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేసే రెండో అభ్యర్థి సుహాసిని కావడం గమనార్హం.తన అక్కకి తోడుగా ప్రచారానికి రానున్న నందమూరి తారక రామారావు, కళ్యాణ్ రామ్.